CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

■ అనాథ యువతి పెండ్లికి గుత్తా కొడుకు దంపతుల సహాయం.

Share it:



నల్లగొండ :చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో సంధ్య-స్వామి వివాహానికి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఆయన కోడలు అఖిలరెడ్డి పట్టు వస్త్రాలు, ఆర్ధిక సహాయం అందజేశారు.


■ నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంధ్య అనే అమ్మాయి నల్గొండ శివారు చర్లపల్లిలోని స్నేహ అనాధ ఆశ్రమంలో పెరిగింది. ఆ అమ్మాయికి అన్ని వసతులు కల్పించి ఒక స్థాయికి తీసుకువచ్చిన అనాధాశ్రమ నిర్వాహకులకు ఆమెకు వివాహం జరిపించడం చాలా కష్టంగా మారింది.దీనితో వివాహ కార్యక్రమానికి సహాయం చేయాల్సిందిగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అనాధ ఆశ్రమ నిర్వహకులు కలిశారు.వెంటనే స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ అమ్మాయి వివాహ కార్యక్రమానికి పట్టు వస్త్రాలు,ఆర్ధిక సహాయం తన తండ్రి పేరున ఉన్న గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరుపున అందజేస్తానని హామినిచ్చారు.ఆ హామీని ఆదివారం నిలబెట్టుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: