CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తోగు నీరే- తాగునీరు

Share it:

 



నీరు కోసం రెండు కిలోమీటర్ల దూరం కాలినడక


మా నీటి గోస చూడండని వేడుకుంటున్న అశ్వాపురం పాడు వలస ఆదివాసీలు


మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని వాలస ఆదివాసీ గిరిజన గ్రామం అశ్వపూరం పాడు గ్రామంలో త్రాగడానికి గుక్కెడు నీరు లేక మండు టెండలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడక చిన్న పిల్లలను సంకల ఎత్తు కోని త్రాగునీరు తెచ్చుకుంటున్నారు.మాకు గుక్కెడు త్రాగునీరు నీరు అందించే  అధికారులు కరువయ్యారు అంటు  "మన్యం మనుగడ" కు వారి గోసను విన్నవించారు .అనంతరం వారిని పలకరించగా మా గ్రామనికి త్రాగునీరు కోసం పైపులైను వేసి మూడు నెలలు గడుస్తున్న నేటికి గుక్కెడు త్రాగునీరు అందించిన అధికారే కరువయ్యారు అంటు ఆవేదన వ్యక్తం చేశారు. మండు వేసవికాలం కావడంతో కాలినడక చిన్నపిల్లలను చంకలో ఎత్తుకోని సుమారు రెండు కిలోమీటర్ల దూరం కలినడకన వెల్లి త్రాగునీరు తెచ్చుకోవలసి వస్తుంది. వలస ఆదివాసీ గిరిజన గ్రామలు అంటే అధికారులకి అంత చులకనగా కనబడుతున్నామా అని ప్రశ్నించారు. అలాగే కరెంటు సౌకర్యం లేకా రాత్రిపూట సమయంలో పాములు ,తేళ్ళు వివిధరకాల విష సర్పాల భయంతో ఉండవలసి వస్తుందన్నారు. మా గ్రామాన్ని అధికారులు సందర్శించి త్రాగునీరు, కరెంట్, రోడ్డు సౌకర్యం కలిపించగలరని అశ్వాపురం పాడు ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: