CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దమ్మపేట గ్రామపంచాయతీ వర్కర్స్ నిరసన.

Share it:

 




 మన్యం టీవీ,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

దమ్మపేట గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ తరపున నిరసన తెలియజేసి సమస్యలతో కూడుకున్న వినతి పత్రంన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శికి మండల పంచాయతీ స్పెషల్ అధికారి మన్యం రమేష్,పాలక మండలి సభ్యులు పగడాల రాంబాబు, చెన్నంశెట్టి యుగంధర్ గార్ల సమక్షంలో ఇవ్వటం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు,సి ఐ టి యు మండల కార్యదర్శి కొప్పుల శ్రీను ఏ ఐ టి యు సి పంచాయతీవర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు,ప్రధాన కార్యదర్శి పేరుమల్ల రాంబాబు, మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవనం వెల్ల తీస్తున్నారని కార్మిక చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం లో 21 వేల రూపాయలుఇవ్వాలని అన్నారు.మేము ప్రజలకు సేవ చేస్తున్నామని మాకు ఆరోగ్య భద్రత కల్పించాలని.ప్రమాద బీమా 15 లక్షలు కల్పించాలని. ప్రభుత్వం ప్రకటించిన సెలవులను ఉపయోగించుకునేలా గా చూడాలని,ఎనిమిది గంటల పని దినములను పకడ్బందీగా అమలు చేయాలని,కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు అనుసరిస్తూ మా న్యాయమైన కోర్కెలను అమలు పరచాలని మా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని లేనియెడల లాక్ డౌన్ తీసివేసిన అనంతరం ని వారిదిక సమ్మెకు వెళతామని ఈ సందర్భంగా తెలిపినారు.ఈ కార్యక్రమంలో తిమ్మరాజు, అన్నవరం,పానుగంటి కృష్ణ, సింగు గొర్రెపాటి బసవయ్య, నాగు,పుల్లారావు,జయలక్ష్మి నరసమ్మ,గంగాధర్,రాఘవులు, జేమ్స్,రామకృష్ణ,నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: