CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పరీక్షలు పెంచాలని ఇల్లందు మండల తహసిల్దార్ కు వినతి

Share it:

 



మన్యం టీవీ :ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రజల ప్రాణాలను బలి చేస్తున్న కరుణ వైరస్ రెండవదశ పరీక్షలను పెంచాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు, నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో వైద్యశాలకు కేవలం 25 కరోనా పరీక్షలు చేయడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రొంపేడు, కొమరారం కరోనా సెంటర్లను ను పెంచాలని, ప్రభుత్వ కాలేజీలు, హైస్కూలు లను కరుణ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్, నాయకులు ఈశ్వర్ గౌడ్, కల్తీ వెంకటేశ్వర్లు, వర్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: