CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

వితంతువులకు మాస్క్‌లు, బియ్యం, నగదు పంపిణీ

Share it:

 


దాత పోగుల లక్ష్మినారాయణ

మన్యం టీవీ ఏటూరునాగారం:

లాక్‌డౌన్‌లో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వితంతువులకు మండల కేంద్రంలోని గణేష్‌ టెంట్‌ హౌజ్‌ యజమాని పోగుల లక్ష్మినారాయణ ద్వారా బియ్యం, మాస్క్‌లు, రూ.200ల నగదును అందజేసినట్లు 5వ వార్డు సభ్యురాలు గుడిమెట్ల కనకతార తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని 5వ వార్డులో వార్డు సభ్యురాలు కనకతార లక్ష్మినారాయణ అందజేసిన బియ్యం, మాస్క్‌లు, నగదును 90 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోగుల లక్ష్మినారాయణ అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారన్నారు. లాక్‌డౌన్‌లో వితంతువులకు ఎలాంటి ఆధారం ఉండదని వారికి బియ్యం, మాస్క్‌లు, రూ.200ల నగదును అందజేశారన్నారు. ఆయనను అందరు ఆదర్శంగా తీసుకోవాలని కనకతార కొనియాడారు. కరోనా విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరుపేదలకు సాయం చేయడం గొప్ప విషయం అన్నారు. అలాగే ఆకలితో ఉన్న తోటి వారికి ఆకలి తీర్చాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గడ్డం సదానందం, అందె రాజేష్, బాల్య రాజేష్, గడ్డం శారద, అలువాల రాజు, గడదాసు శశి, సౌమ్య, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: