CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

###ఆదివాసీ గుడేల కరోన సంరక్షణ చైతన్య యాత్ర...###

Share it:

 



ఆదివాసీ ఉద్యమనాయకుడు తుడుందెబ్బ  రాష్ట్ర అధ్యక్షుడు,ఆదిలాబాద్ MP సోయం బాపురావు దాదా  ఈరోజు హైదరాబాద్ లో ఆదివాసీ 9 తెగల సమన్వయ కర్త మరియు కరోనా సంరక్షణ చైతన్య  యాత్ర నిర్దేశకులు చుంచు రామకృష్ణ (డి.ఈ)మరియు ఏ.ఈ.డబ్ల్యూ .సి.ఏ (ఆదివాసీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం) నాయకులు మరియు ఆధార్ సొసైటీ సభ్యులతో కలిసి కరోన సంరక్షణ యాత్రలో భాగంగా నిరుపేద మరియు కరోనా బాధితులకు ఇవ్వటానికి, ఆదివాసీ  సంస్కృతిని ప్రతిబింబించేలా  తయారు అయిన మాస్క్లలను ఈరోజు  లాంఛనంగా విడుదల చేయడం జరిగింది.కరోన సంరక్షణ చైతన్యయాత్రలో భాగంగా ఈ మాస్క్ లను ఆదివాసీ గూడాలలో నిరుపేద ప్రజలకు మరియు కరోన భాదితులకు పంపిణీ చేస్తామని మరియు వాటితోపాటు రాగి పిండి, జొన్న పిండి మరియు ఏ.ఈ.డబ్ల్యూ.సి.ఏ సభ్యులు, దాతలు అందచేసే వస్తువులను కరోనా  భాదితులకు అందించుటకు తగిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని 9 తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ గారు తెలిపారు.

ఈ యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కొనసాగుతుంది అని చెప్పారు.ఈ సందర్భంగా సోయం దాదా ఆదివాసీ మాస్క్ డిజైనర్ కోండ్రు పూజ కు జాతి తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే మహిళా చైతన్యశక్తి సభ్యురాళ్లు కోండ్రు సుధారాణి , అట్టాం కమల, రామలక్మి, ఉమాదేవి, దుర్గ, వీరస్వామి, వసంత్, వీసాలు కృష్ణ, గన్నెబాయిన శ్రీను  గారు ఈ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమాలు ఏర్పాట్లు చూస్తున్నారు.

ఈ కరోనా  సంరక్షణ చైతన్య యాత్రలో మీరూ ఏదయినా సహాయం ప్రజలకు అందించాలి అంటే మీ సహాయాన్ని ఏ.ఈ.డబ్ల్యూ.సి.ఏ సభ్యులకు తెల్పగలరు.ప్రోగ్రాము కోఆర్డినేటర్ సోయం.కన్నరాజు @ 9491966008.

Share it:

Post A Comment: