CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రాణ (వాయువు) ధాత

Share it:

 



విప్ రేగా స్పూర్తితో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించిన ప్రవాస భారతీయుడు విశ్వ కంది


పినపాక, కరకగూడెం మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించిన విప్ రేగా కాంతారావు,వైస్ ఎంపీపీకంది సుబ్బారెడ్డి.

మన్యం మనుగడ ,పినపాక/కరకగూడెం: 


కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంటే, దాని ప్రభావం కారణంగా చాలామంది కరోనా బాధితులు ఆక్సిజన్ శరీరంలోకి అందక చనిపోతున్నారు. ఇదే విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు  విశ్వ కంది, పినపాక ఏజెన్సీ ప్రాంత వాసులకు అత్యవసర సమయంలో ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పినపాక కరకగూడెం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించాలని అనుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకు తెలియచేశాడు. సోమవారం రోజున పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో లో పినపాక, జానంపేట, కరకగూడెం లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కొక్కటి 70 వేల విలువగల మూడు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో, రేగా కాంతారావు స్ఫూర్తితో ఈ విధంగా ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ, మన్యం వాసుల కొరకు ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను  అందించిన విశ్వ కంది,  ఆయన తండ్రి కంది సుబ్బారెడ్డి లకు పినపాక నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పినపాక కరకగూడెం మండలాలకు సంబంధించిన ఎంపీపీ లు గుమ్మడి గాంధీ, రేగా కాళిక,పినపాక సర్పంచ్ గొగ్గలి నాగేశ్వరరావు, తోగూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రావుల సోమయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, మండల నాయకులు రేగా సత్యనారాయణ,పోలిశెట్టి సత్తి బాబు, శ్రీనివాసరెడ్డి,  పెద రామలింగం,కామేశ్వరరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శివ కుమార్, వెంకటేశ్వరరావు, శృతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: