CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కేసులు పెరుగుతున్నాయి బయట తిరగకండి

Share it:

 


లాక్ డౌన్ ను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టివిఆర్ సూరి 


మన్యం మనుగడ, పినపాక:


తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణ లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టివిఆర్ సూరి క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు, నిత్యం సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే తాను స్వయంగా గ్రామాలలో కాలి నడకన తిరుగుతూ ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. మంగళవారం నాడు కాలి నడకన సుమారు మూడు కిలోమీటర్ల నడిచి క్రాస్ రోడ్డు, భూపాలపట్నం, సీతంపేట, పినపాక గ్రామలలో పర్యటించారు ఈ సందర్భంగా రోడ్ల పై కనపడిన యుతకు మరియు గ్రామస్తులకు తగు సూచనలు చేశారు. కరోనా రెండవ దశలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని రెండవ దశలో కరోనా వైరస్ తీవ్రత వలన కరోనా భారిన పడి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అనవసర ప్రయాణాలు రద్దు చేసుకొని ఇంటి వద్దనే ఉండాలని సూచించారు, అనుమతులు లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారికి జరిమానా విదించడం తో పాటు కేసులు నమోదు చేస్తామని, కావున ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు, అదే విధంగా మండలంలో వివాహాలు జరుపుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని తెలిపారు, వివాహానికి అనుమతి పొందిన వారు ప్రభుత్వ నిభందనల ప్రకారం వివాహం జరుపుకొవాలని సూచించారు. అదేవిధంగా వివాహ సమయంలో రహదారులు పూర్తిగా మూసి వేయవద్దని అత్యవసర పరిస్థితి లో అంబులెన్స్ లు వెల్లే విధంగా రహదారులు ఉంచాలని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: