CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

Share it:

 


*ప్రభుత్వం బాధ్యతగా వివరించక పోవడం మూలంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు. 

*కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించాలి.

*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

*ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.

మన్యం టీవీ ఏటూరు నాగారం:

ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ ధర్నా రాస్తారోకో ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని, తెలంగాణ రాష్ట్రంలో గంటగంటకు మరణాల రేటు పెరుగుతున్న ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని ప్రభుత్వ ఆస్పటల్ లో సరైన వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్ లోకి చికిత్స చేసుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో పేద ప్రజల దగ్గర డబ్బులు ఏవిధంగా దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అని ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ఆరోగ్య శ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని పేద ప్రజల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని ఇది అంతం కాదు అని ఆరంభం మాత్రమే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తిరుపతి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, విద్యార్థి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సతీష్, అంజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు రాహుల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి, జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, జిల్లా నాయకులు రాహుల్, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగిల్ గణేష్, ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అజయ్, రాహుల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: