CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సారూ- నన్ను కొంచెం ఆదుకోరూ.........

Share it:

 


గుండెకు రంధ్రం - ఫలితం ఆయాసం

వచ్చే కాస్త ఆదాయం మందులకే పరిమితం

ముసలి అవ్వ తాతలతో బతుకు భారం.


మన్యం మనుగడ, పినపాక:

 అత్తమామలు మంచానికే పరిమితం. అంతుచిక్కని వింత వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలైన అత్త. పసిప్రాయంలోనే గుండెకు రంధ్రం కారణంగా ఆయాసంతో బాధపడుతున్న కొడుకు. దానికి తోడు ఆర్థికంగా  బతుకు భారం . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అమరారం పంచాయతీకి చెందిన తిర్లాపురం గ్రామ మినీ అంగన్వాడీ ఆదివాసి ఉపాధ్యాయురాలు సులోచన బ్రతుకు భారం పై,ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ సహాయంతో, "మన్యం మనుగడ" క్షేత్రస్థాయి పర్యటనలో అందిస్తున్న ప్రత్యేక కథనం.

 అమరారం పంచాయతీకి చెందిన కలేటి కృష్ణయ్య  సులోచన దంపతుల మొదటి సంతానం నిహాల్ (7 సంవత్సరాలు). గడచిన మూడు సంవత్సరాల నుండి నిహాల్ అనారోగ్యంగా ఉండటం, ఆయాసం రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, హైదరాబాదుకు తీసుకెళ్ళమని తెలియజేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, గుండెకు రంధ్రం ఏర్పడిందని తెలియజేశారు. ఒక్కసారిగా ఆ దంపతులకు, ఆ విషయం తెలిసి భయభ్రాంతులకు గురయ్యారు. వైద్యులను ఎలాగైనా వైద్యం చేయాలని బతిమిలాడ గా, ఆరోగ్యశ్రీ ద్వారా త్వరలోనే ఆపరేషన్ చేస్తామని అంగీకరించారు. ఈలోగా కరోనా మహమ్మారి కారణంగా ఆపరేషన్ ను నిలిపివేశారు.  కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాబు కు ఆపరేషన్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అప్పటి నుండి మందులను వాడుతున్నామని, నెలకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఖర్చు బాబు మందులకి అవుతున్నాయని, ఆర్థికంగా వెసులుబాటు లేని కారణంగా ఒక్కోసారి మందులను సరిగా కొనలేక పోతున్నామని ఆవేదనను తెలియజేసింది.

దీనికితోడు తన మామ, అత్త అయిన కలేటి ముత్తయ్య, లక్ష్మి వృద్ధాప్యం కారణంగా మంచానికే పరిమితమై ఉండటం వల్ల, వారి బాగోగులు చూడలేక బ్రతుకు భారంగా మారిందని, గత రెండు సంవత్సరాల నుండి అత్త లక్ష్మి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ, వింత జీవి లాగా తయారయ్యారని ఆవేదనను తెలియజేసింది. పెద్ద కుమారుడైన రాంబాబు- రజిత లు కూడా మాకు చేదోడువాదోడుగా ఉంటూ అత్తమామలను చూసుకుంటున్నామని, కానీ ఆర్థికంగా వెసులుబాటు లేక పోవడంతో సరైన ఆహారాన్ని అందించే లేక పోతున్నామని, కరోనా కష్టకాలంలో రేషన్ కార్డు కూడా లేకపోవడంతో రేషన్ షాప్ నుండి బియ్యం వచ్చే పరిస్థితి కూడా లేదని, తన బాధను తెలియజేసింది. ముక్కుపచ్చలారని తన బిడ్డ ఆయాసపడుతూ ఉండడంతో చూడలేకపోతున్నా మని, దయ గల దాతలు ఎవరైనా ఉంటే ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని వేడుకుంటుంది.

Share it:

TELANGANA

Post A Comment: