CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష తను మానుకోవాలి, ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి

Share it:

 

👉 ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి డిమాండ్.

మన్యం టీవీ, మణుగూరు:

 సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కరోనా బారిన పడితే సింగరేణి యాజమాన్యం వారి పట్ల వివక్షత చూపకుండా ఐసోలేషన్ సౌకర్యం కల్పించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలకు తెగించి పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం వారిపట్ల వివక్షత చూపడం సరైంది కాదన్నారు. మల్లారం సివిక్ లో పనిచేస్తున్న మంగయ్య ,బీమా అనే కాంట్రాక్ట్ కార్మికులకు కరోనా వస్తే వారిని ఐసోలేషన్ సెంటర్ లో ఉంచి ఉచిత వైద్యం చేయాల్సిన టువంటి సింగరేణి యాజమాన్యం వారిని ఐసోలేషన్ సెంటర్లో ఉంచకుండా కాలనీలోని ఒక పాత పాడుబడ్డ క్వార్టర్ ను బాగు చేయించి దానిలో ఉంచితే, కాలనీ వాసులు కరోనా పేషెంట్లు మా కాలనీ మధ్యలో ఉండకూడదని అక్కడి నుండి తరిమేస్తే అడవిలో తలదాచుకుని, అడవిలో వాగులో స్నానం చేయాల్సిన పరిస్థితి దాపురించింది అన్నారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం ఎందుకు ఈ వివక్ష చూపుతుందని, కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలు ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్షతను విడనాడి వారిని ఐసోలేషన్ సెంటర్ లో ఉంచి ఉచిత వైద్యం అందించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు తదితర రక్షణ పరికరాలు అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ రక్షణ పరికరాలు ఇవ్వ నట్లయితే, కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్షత ను మానుకోకపోతే అవసరమైతే విధుల బహిష్కరణ కు కూడా కాంట్రాక్టు కార్మికులను సిద్ధం చేస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరూ మీ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేయాలన్నారు. అవసరమైతే విధుల బహిష్కరణ కు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరూ మీ పని ప్రదేశాలలో తగిన జాగ్రత్తలతో పనిచేయాలని సూచించారు.

Share it:

Post A Comment: