CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా సోకి హోమ్ క్వారంటైంన్ లో చికిత్స పొందుతున్న కుటుంబాల కు బియ్యం,నిత్యవసర వస్తువులు వితరణ: అందజేసిన సింగరేణి కార్మికుడు వేదా శ్రీనివాస రావు

Share it:

 


  

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 లో ఈపి ఆపరేటర్ గా పని చేస్తున్న వేదా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో,కరోనా వైరస్ సోకి హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న కోవిడ్- 19 వ్యాధి గ్రస్తుల కుటుంబాలు ఖమ్మం తోగు, సింగరేణి నిర్వాసిత రైల్వే స్టేషన్ కొత్త పద్మ గూడెం,బీసీ కాలనీ నిరుపేద కుటుంబాల కు 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులకు, ఆర్థిక సహయం అందజేసి తమ అవతారాన్ని చాటుకున్నారు.శుక్రవారం ఉదయం సింగరేణి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో వైద్యులు డాక్టర్ శేషగిరిరావు,డాక్టర్ తాళ్లూరి. సురేష్ చేతుల మీదుగా బాధిత కుటుంభాల చెందిన గ్రామస్తులకు,బంధువులకు అందజేశారు.కొన్ని బాధిత కుటుంబాలకు సింగరేణి సేవా సమితి సభ్యులు ఇళ్లకు తీసుకెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తన సంపాదన నుండి కొంత సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్న వేదా శ్రీనివాస్ రావు ను వారు అభినందించారు. సింగరేణి సేవా సమితి సభ్యులకు సేవా స్ఫూర్తి ని వారు కొనియాడారు.కరోనా వైరస్ సెకండ్ వేవ్ గిరిజన గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించాలని ప్రజలను వైద్యులు కోరారు. ఆదివాసి గ్రామాలలో సరైన అవగాహన లేని కారణంగా వైరస్ ఇంకా వేగంగా విస్తరించే అవకాశం ఉందని ఈ గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకించి రేకుల గండి, రాయనపేట,బుగ్గ ఖమ్మం తో గు,బుడుగుల,సర్వాయి గుంపు,కుమ్మరి గుంపు, పెద్దపల్లి,పద్మ గూడెం లాంటి గ్రామాలలో కూడా వైరస్ సోకకుండా అవగాహన కల్పించాలని,ప్రజలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని,సింగరేణి సేవా సమితి సభ్యులు సయ్యద్ నాసర్ పాషా ప్రభుత్వ వైద్యులను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య,ల్యాబ్ రవి, ఆదినారాయణ,నాగేంద్ర, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: