CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏటూరు నాగారం సబ్ డివిజన్ గ్రామాలకు అందుబాటులోకి ఫైరింజన్ సేవలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్న ఫైర్ ఇంజన్ ను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాలతో ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ప్రత్యేక చొరవ తీసుకొని ఏజెన్సీ మండలాలలో వేసవికాలంలో ఎదురయ్యే అగ్నిప్రమాద సమస్యలను నివారించడానికి బిల్ట్ కర్మాగారంలో ని ఫైర్ ఇంజన్ వాడకంలోకి తీసుకువచ్చారు. దీనిని ఉపయోగించడానికి ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి సిఐ కిరణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తగిన శిక్షణ ఇప్పించారు. కాగా ఈ రోజు నుండి ఏజెన్సీ మండలాలలో ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే ఏటూరు నాగారం పోలీసులకు సమాచారం అందిస్తే సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజన్ సేవలు అందిస్తామని పోలీసులు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: