CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న జ్యోతిర్మయి కి మణుగూరు టిబిజీకేయస్ చేయూత:బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు

Share it:

 


         


మన్యం టీవీ మణుగూరు:

కరోనా సెకండ్ వేవ్ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రళయం సృష్టిస్తూ,అనేక మంది కోవిడ్ బారిన పడి హోమ్ క్వారంటైన్ ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారికి జ్యోతిర్మయి మహిళ అండగా నిలిచి అడిగిన వారికి రుచికరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూర్చి అందచేయడం అభినందించవలసిన విషయమని మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు తెలియజేసారు.తాను ఒక గృహిణి,ప్రభుత్వ ఉద్యోగిగా  ఉండి ఇటువంటి అపత్కాల సమయంలో కోవిడ్ బారిన పడి కుటుంబాలకు సేవ చేయడం స్ఫూర్తి దాయకమని,ఆమె చేస్తున్న సేవలకు తోడ్పాటు ను అందిస్తూ మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి కమిటి తరుపున బుధవారం సాయంత్రం టిబిజీకేయస్ కార్యాలయంలో  ఐదు వేల రూపాయలు పైన విలువ చేసే,ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే అరటిపండ్లు, మామిడిపండ్లు,కిస్ మిస్ లు,బాదంపప్పు,కిమియా కర్జురా,యాపిల్స్ ను ఆమెకు స్వయంగా అందించి ఆమె చేస్తున్న సేవలకు చేయూత గా నిలిచారు.ఆమె సేవలు  బ్రాంచి నాయకులు ప్రతి ఒక్కరూ కొనియాడారు. కోవిడ్  మొదటి వేవ్ లో  మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి తరుపున లక్ష రూపాయల వరకు ఖర్చు తో  స్వచ్ఛంద కార్యక్రమాలు చేయటం జరిగిందని రానున్న కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో  టిబిజీకేయస్ మణుగూరు బ్రాంచి అన్ని వేళల అండగా నిలుస్తుందని మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు,జ్యోతిర్మయి కి తెలిపారు.మానవతా దృక్పథంతో కోవిడ్ బారిన పడిన వారికి చేయూత గా నిలిచిన టిబిజీకేయస్ బ్రాంచి కమిటి సభ్యులకు జ్యోతిర్మయి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం రీజనల్ కమిటి సభ్యులు అబ్దుల్ రవూఫ్, బ్రాంచి నాయకులు వీర భద్రయ్య,కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ,ఎస్.వి.ఎస్. ఎన్.వర్మ,బాణోత్ కృష్ణ, సి.హెచ్.వెంకటేశ్వర రెడ్డి బుర్ర వెంకటేశ్వర్లు,అశోక్, నాగేల్లి.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: