CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశ వర్కర్లను ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించండి

Share it:

 


సి ఐ టి యూ

మన్యం టీవీ మంగపేట.

    ఆశా వర్కర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించాలి అని, ఆశలకు కరోనా  పని చేసినందుకు అదనపు పారితోషికం ఇవ్వాలని, పి ఆర్ సి గైడ్ లైన్స్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని, కనీస వేతనం 21000 అమలుచేయాలని తదితర డిమాండ్స్ పరిష్కరించాలని ఆశల దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనే ఆల్ ఇండియా ఆశ వర్కర్స్ ఫెడరేషన్ ( సీఐటీయూ) పిలుపు మేరకు  మండలం లో  ఉన్న ఆశలు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. మంగపేట,బ్రహ్మనపళ్లి,చుంచపల్లి పి హెచ్ సి ల పరిధిలో అన్ని  ఆరోగ్య ఉప కేంద్రం ముందు మరియు ఇతర గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల ముందు ఆశ లు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని కోవి డ్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపారు.దాదాపు 100 మంది ఆశలు ఈ సమ్మెలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆశలు ప్రభావతి, నాగమణి మాట్లాడుతూ 

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో  ఆశలు కొరొనకు ఎదురొడ్డి పనిచేస్తున్నప్పటికీ వారికి కేవలం 3000 నుండి 7000 వరకు మాత్రమే పారితోషికాలు ఇవ్వడం దారుణం అన్నారు. అశాలకు  గ్లౌజులు,మాస్కులు, పి పీ ఈ కిట్స్ ఇవ్వాలని, కోవిడ్ కు గురైన ఆశలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆశలకు సెలవులు ఇవ్వాలని అన్నారు.  పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్లు, రికార్డ్స్, రిజిస్టర్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో   ప్రభవతీ, నాగమణి,కనక లక్ష్మీ, రజిత,చంద్ర వాని, సుజాత,రమ,కవిత, సరోజన, కర్రి విజయకుమారి, పుణ్యవతి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: