CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట లో విషాదం

Share it:

 



షాక్ కు గురైన అన్న చెల్లెలు


బాలిక మృతి బాలుడు పరిస్థితి విషమం


హుటా హుటినఏటూరునాగారం ఆసుపత్రికి తరలింపు


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓమూత పడ్డ బిర్యానీ పాయింట్ లోకి వెళ్లి ఆడుకుంటున్న ఇరువురు పిల్లలు (అన్న-చెల్లెలు) అనూహ్యంగా విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఇందులో పదేళ్ల బాలిక అమృత వర్శిని అక్కడికక్కడే మృతి చెందగా బాలుడు అపస్మారక స్థితిలో ఉండి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యులు తెలిపారు. ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.మండల కేంద్రానికి చెంది మంగపేట విఆర్ఏ గా పనిచేస్తున్న రాము ఇటీవల ఎమ్మార్వో ఆఫీస్ కు సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు నిర్మించుకొని తన భార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు.అయితే ఆ ప్రక్కనే ఇటీవల మూతపడి ఉన్న బిర్యానీ పాయిoట్ లోకి తొమ్మిది పదేళ్ల వయస్సు ఉన్న రాము పిల్లలిద్దరూ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆడుకోవటానికి వెళ్లారు.ఈ క్రమంలో 7 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్ళటానికి పిల్లలు ఇద్దరు వెనుక గుమ్మం ద్వారా బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ తలుపుగా అడ్డుపెట్టిన రేకు తలుపును తీస్తుండగా అప్పటికే మంగళవారం రాత్రి పూట వచ్చిన గాలి వానకు బిర్యానీ పాయింట్ సర్వీసు విద్యుత్ వైరు మధ్యకు తెగిపడి ఆరేకులపై పది ఉండడంతో అన్నా చెల్లెలు ఇరువురు విద్యుత్ షాక్ తగిలింది. బాలుడు స్పృహతప్పి కొద్దిదూరంలో పడిపోగా బాలిక తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.అయితే ప్రమాదాన్ని గమనించిన కొందరు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.కాగా అపస్మారక స్థితిలో ఉన్న బాలుడికి ప్రాధమిక చికిత్స చేసినప్పటికీ, ఫలితం లేకపోవడంతో వెంటనే పోలీసులు అంబులెన్స్ అందుబాటులో లేకున్నా స్థానిక తహశీల్దార్ వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. మృతి చెంది బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: