CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండలంలో కరోనా మరణ మృదంగం...

Share it:

 





 

మన్యం టీవీ :జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనా కేసుల ఉధృతి ఆగడం లేదు. కరోనా దాటికి అనేక మంది మండలంలో ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అయినా కనీసం ఎవరికీ పట్టనట్లు ప్రజలు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతున్నారు. నిన్నటికి నిన్న మనందరి సుపరిచితులు ప్రముఖ పురోహితులు విశ్వనాధ అయ్యగారు కరోనా ధాటికి అనంత లోకంలో కలిసిపోయారు. మళ్లీ నేడు మనందరి మిత్రుడు, శ్రేయోభిలాషి, సుదీర్ఘ కాలంగా స్థానిక సహకార సంఘ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గడ్డం వెంకటేశ్వర్లు, ( జీవి) నేడు నేలకొరిగారు. ఇవే కాక మండలంలోని అనేక గ్రామాలలో కరోనా వ్యాధి తో మృతి చెందుతున్నారు. అయినా కనీసం ఎవరికీ పట్టనట్లు ప్రజలు వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే అనేకమంది కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా.. మండలంలో ప్రభుత్వ అధికారులు, పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ, తమ శక్తి మేర కరోనా కట్టడికి కృషి చేస్తున్నా

 ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా చనిపోయిన అప్పుడు అయ్యో అనడం తదనంతరం మళ్లీ కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఎవరి పనులు వారు చేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం అధికారులు మాత్రం ఎంతవరకు చర్యలు చేపట్ట గలరు. స్వతహాగా మనకు లేనప్పుడు! పోలీసులు కనపడినప్పుడు మాస్కులు, పెట్టుకోవడం హెల్మెట్, పెట్టుకోవడం ఇది ఎవరి కోసం, మండలంలో ఈ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం కోసం మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఒకసారి సమావేశమై దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.    సంఘం నాగరాజు, మన్యం టీవీ రిపోర్టర్, జూలూరుపాడు.

Share it:

TELANGANA

Post A Comment: