CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆశ వర్కర్లకు కు నిత్యావసర వస్తువులు అందజేత

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని ఆశవర్కర్లకు తెరాస నాయకులు యడ్లవల్లి నరసింహారావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా యడ్లవల్లి నరసింహారావు మాట్లాడుతూ ఇటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో, కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న డాక్టర్స్, నర్స్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు వీరందరు బాగుంటేనే మనం బాగుంటాము. వీళ్ళు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వీరికి మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము.ముఖ్యంగా కొద్దిపాటి వేతనం తీసుకొని ఆహర్నిశలు కష్ట పడుతున్న ఆశాలకు, అంగన్వాడీలకు, పారిశుధ్య కార్మికులకు రాజుపేట తెరాస గ్రామ నాయకులు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయం చేసారు. కోవిడ్ నిబంధనలు పురస్కరించుకొని ఈరోజు ఆశ వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమం లో తెరాస సీనియర్ నాయకులు యడ్లవల్లి నర్సింహారావు, బండ్ల మధుప్రసాద్ (చినబాబు ), పోలిన హరిబాబు,జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు,తెరాస గ్రామ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు, రాయసాబ్, మద్దిపాటి త్రిమూర్తులు, తెలంగాణా శంకర్, పేరయ్య కర్రికేశవరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: