CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

Share it:

 



కరోనాకు ఎవరూ భయపడొద్దు


భయమే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది


ధైర్యంగా ఉంటే కోలుకోవడం చాలా సులభం


---- సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్

............................................................................

ములుగు, మే 25: కరోనా బాధితులెవరూ బయపడవద్దని, భయమే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని, మనోధైర్యంతో ఎదుర్కోవాలని సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ తెలిపారు, ఈ మేరకు ములుగు మండలంలోని జగ్గన్నగూడెంకు చెందిన సర్వాపూర్ సర్పంచ్ దగట్ల విజయ-రవి కుటుంబానికి ఇటీవల కరోనా పాజిటివ్ కాగా వారి కుటుంబాన్ని  గురువారం తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరామర్శించి బాధితులకు మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యాన్ని మించిన వ్యాక్సిన్‌ లేదని,  బలమైన నమ్మకం ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చని అన్నారు.  కరోనా సోకిందని తెలియగానే గాబరాపడి, ధైర్యాన్ని కోల్పోతే అదే మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందకుండా 14 రోజులు ఇంట్లోనే  దైర్యంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు, రోజుకు రెండు పూటలా ఆవిరి పట్టుకుంటూ డాక్టర్లు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు, తిప్పతీగ, నేలఉసిరి వేపాకులు అందుబాటులో ఉంటే  వాటిని మరిగించి రోజుకు రెండు పుటలా తాగాలని తెలిపారు. వేడివేడి భోజనంతోపాటు, గుడ్లు, మాంసం మొదలైన రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు గోగు నర్సయ్య, దగట్ల రవి, దగట్ల శోభన్ బాబు, ఈక లక్ష్మయ్య, సాంబయ్య తదితరులు ఉన్నారు.

Share it:

SLIDER

Post A Comment: