CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

తుపాకులగూడెం బ్యారేజ్ నీటి వాటాలో ఏజెన్సీ ప్రాంత మండలాలకు నిరందించాలి

Share it:

 


తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూర్ నాగారం మండల కేంద్రంలో మరికొద్ది రోజులలో దిగ్విజయంగా నిర్మాణ పనులు పూర్తి అయి, తెలంగాణ జల సాకరణ దిశగా అడుగులు వేస్తున్న శ్రీ సమ్మక్క తుపాకులగూడెం బ్యారేజ్ నీటి సమస్య పై తుడుం దెబ్బ జిల్లా కమిటీ అత్యవసర పాత్రికేయ సమావేశం జిల్లా నాయకులు మల్లెల నారాయణ అధ్యక్షతన జరిగింది. 

ఈ సమావేశమునకు హాజరైన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2121 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్మాణానికి తలపెట్టిన తుపాకులగూడెం బ్యారేజ్ నుండి లిఫ్ట్ చేసే 50 టీఎంసీ ల, నీటి నుండి సమ్మక్క సారలమ్మ గడ్డ గా పరిగణించబడే ములుగు జిల్లా కు గాని ఈ ప్రాంతంలో నివసించే ఏజెన్సీ మండ లాల, ప్రజలకు గాని ఒక్క చుక్క కూడా నీరు అందించే ప్రణాళిక ప్రభుత్వం చేయకపోవటం బాధాకరమైన విషయమని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా పీవీ నరసింహారావు ప్రాజెక్టుగా నామకరణం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంతన పల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంతో ఆదివాసీ గూడేలకు ముంపు ఉంటుందని ఆదివాసీల ఉద్యమ ఆకాంక్షను గ్రహించి నాటి తెలంగాణ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు నేతృత్వంలో స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదుల లో కూర్చొని ప్రాజెక్టు డిజైన్ మార్చి ఆదివాసిల రక్షణ దిశగా ఆలోచన చేసి, ముంపు లేని ప్రాంతం అయిన తుపాకుల గూడెం లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమే కానీ ఈ ప్రాజెక్టు నీటి నుండి స్థానిక ప్రాంత వాసు ల వ్యవసాయ భూములకు కూడా నీరు అందించే చర్యలు నాడు చేయలేదు. కాబట్టి స్థానిక అధికార పార్టీ ప్రతినిధులు మంత్రులు మరియు అధికారులు ఆ ప్రయత్నం చేయాలి అని కోరారు.

గోదావరి నది పూర్తిగా 150 కిలోమీటర్ల పొడవు ములుగు జిల్లాలో ప్రవహిస్తున్నదని, తుపాకుల గూడెం బ్యారేజ్ నుండి లిఫ్ట్ చేసిన నీరు ఎక్కడో ఉన్న కరీంనగర్, వరంగల్,మెదక్,నిజమాబాద్,నల్గొండ, కమ్మం, జిల్లాలలోని 7,50,000 ఎకరాలకు నీరు తరలిస్తున్నారు. తప్ప స్థానిక ములుగు జిల్లాలోని స్థానిక వాసులకు ,గోదావరి నది ఒడ్డున తర తరాలుగా జీవిస్తున్న ఆదివాసీల భూములకు,మాత్రం ఒక ఎకరం కి కూడా నీరు అందించే పరిస్థితి లేదు అని అన్నారు. ఇది ముమ్మాటికీ నీటి దోపిడీ గానే పరిగణించాల్సి వస్తుంది అని అన్నారు. 

ఏజెన్సీ ఏరియాలో కాకతీయ కాలం నుండి గొలుసు కట్టు చెరువుల నిర్మాణం, ప్రతి గ్రామం లో ఉంది. అని కానీ ప్రతి ది నేడు వర్ష దార పంటలే అని అన్నారు. వర్షం అధికంగా పడితే అతి వృష్ఠి తక్కువగా పడితే అనావృష్టి ల మా ప్రాంతం గోస పడుతుంది. అని అన్నారు. పొలాలు బీడులుగా మారి నీరు లేక ఎక్కిరిస్తున్నయి అని అన్నారు. ఈ ప్రాజెక్టు నీటి నుండి ఏజెన్సీ లోని అన్ని చెరువులకు నీరు అందించే ప్రణాళిక చేసి ఆదివాసీలను వ్యవసాయ రంగ అభివృద్ధి లోకి తీసుకు రావాలి అని అన్నారు. ఇదే గాక ఈ ప్రాజెక్టు తో 8 లక్షల మందికి ఉచిత మంచినీటి సరఫరా లక్ష్యం ఉంది. అని ముందుగా స్థానిక ఆదివాసి గుడెల కు ప్రతి ఇంటికి తాగు నీరు అందించిన తరువాతనే బయటికి పంపాలి అన్నారు.

ములుగు జిల్లా ప్రాంతం చారిత్రకంగా కాకతీయుల కాలం నుండే పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అని ఈ జిల్లాలో పరిశ్రమల సంఖ్య సున్న అని, అందుకే లక్నవరం రామప్ప ఆయకట్టు లు మొదలుకొని అన్నీ చెరువులకు గోదావరి నీటిని పైపుల ద్వారా అందించ గలిగితే ఈ జిల్లా వ్యవసాయ రంగం లో గొప్పగా అభివృద్ది చెందుతుంది. అనే విషయాన్ని చరిత్ర నుండి గ్రహించాలి అన్నారు.

ఇప్పటి కే 2004 లో 1000 కోట్లతో గోదావరి నది పై నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ నుండి లిఫ్ట్ చేసే 60 టీఎంసీల, నీరు , వరంగల్, ఖమ్మం, కరింగర్,రంగారెడ్డి,జిల్లాలలో 6,21,000, ఎకరాలకు నీరు పట్టుకు పోయి, స్థానిక ఆదివాసీలకు ఒక్క చుక్క కూడా సాగు,త్రాగు నీరు అందించలేదని అన్నారు. అదే మోసం మళ్లీ ఈ ప్రాజెక్టు వలన జరగ వద్దని అన్నారు. ఒకసారి మోసపోయామని రెండో సారి మోస పోవడానికి సిద్దంగా లేము అని తేల్చి చెప్పారు.

జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం కి స్థానిక పరిస్థితులు తెలియ చేసి నీరు అందించేలా చూడాలని అన్నారు. లేని క్రమం లొ నీటి దోపిడీకి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీ లు,ప్రజా కుల సంఘాలను కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి విద్యార్థి సంఘం (ASU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలం కిషోర్ ,ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లీ గణేష్,జిల్లా నాయకులు కురుసం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: