CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కానిస్టేబుల్ భాస్కర్ ఆధ్వర్యంలో మహిళా మృతదేహానికి అంత్యక్రియలు

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల కేంద్రమైన బూర్గంపాడులోని ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ  అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. అసలే కరోనా కాలం ఎలా చనిపోయిన కరోనా అనే భావించే తరుణంలో ఆ మహిళా మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు ఆ నలుగురు కరువయ్యారు. కరోనా మహమ్మారి భయంతో  ఆ మృతదేహాం కు మధ్యాహ్నం నుంచి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మృతదేహాన్ని చూసేందుకు సైతం జనాలు బంధువులు స్నేహితులు రాని తరుణం.


కానిస్టేబుల్ భాస్కర్ ముందడుగుతో బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బూర్గంపాడు కు చెందిన కేసుపాక  భాస్కర్ ఈ మహిళ మృతదేహం అంత్యక్రియలకు ముందడుగు వేశారు.ఇదే సమయంలో బూర్గంపాడు ఎస్సీ కాలనీకి చెందిన తోకల వినయ్ పవన్, తోకల నాగేశ్వరరావు(బుజ్జయ్య) , తోకల ముత్యాలరావు లు  మేము సైతం అంటు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు

వచ్చారు. 

బూర్గంపాడు గ్రామ సర్పంచ్ స్వప్న సహకారంతో మృతదేహాం అంత్యక్రియలకు పిపిఈ  2 కిట్లు అందజేశారు. అదే తరుణంలో బూర్గంపాడు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు  గోనెల నాని మరో పీపీఈ  కిటు ను అందజేశారు.అదేవిధంగా మహిళా మృతదేహం అంత్యక్రియలకు నేను సైతం అంటూ గోనెల నాని ముందుకు వచ్చారు.

అధైర్యపడొద్దు ఇలాంటి సమయంలో అండగా ఉండాలి.

బూర్గంపాడు ఎస్సై జితేందర్

కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారని,అనారోగ్యంతో చనిపోతున్న వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించటానికి కొందరు ముందుకు రావడం లేదని ఇలాంటి సమయంలోనే అధైర్య పడకుండా బాధిత కుటుంబాలకు అండగా ఉండి ధైర్యాన్ని కల్పించాలని బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్ అన్నారు. మహిళ అంత్యక్రియలకు ముందుకు వచ్చినా కానిస్టేబుల్ భాస్కర్ బృందాన్ని ఎస్ ఐ  అభినందించారు.అలాగే గోనెల నాని ని కూడా ఎస్సై అభినందించారు..అనంతరం  పీపీఈ  కిట్లు ధరించిన వీరంతా మృతదేహాన్ని కిన్నెరసాని నది పరివాహక ప్రాంతానికి మోసుకొని వెళ్లి అంతక్రియలు నిర్వహించారు.  దీంతో ఆ మహిళ మృతదేహం అంత్యక్రియలు సవ్యంగా సాగాయి...


ఆపత్కాలంలో అండగా ఉండటమే మానవత్వం

కానిస్టేబుల్ కేసుపాక భాస్కర్ 

ఇలాంటి ఆపత్కాలంలో బాధితులకు అండగా ఉండటమే నిజమైన మానవత్వం అని కానిస్టేబుల్ కేసుపాక భాస్కర్ అన్నారు..మహిళా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలందరూ భయంతో ఉన్న సమయంలో మృతదేహాలకు ఆఖరి మజిలీ చేయటానికి కూడా ముందుకు రాకపోవడం ఎంతో బాధాకరం అన్నారు.అందుకే బూర్గంపాడు లో ఒక బృందాన్ని తాను అవగాహన కల్పించి తయారు చేశానని ఆయన పేర్కొన్నారు. సహకరించిన బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్, సర్పంచ్ స్వప్న , తెరాసా పార్టీ  పట్టణ అధ్యక్షులు గోనెల నాని కి ప్రత్యేక ధన్యవాదాలను భాస్కర్ తెలిపారు.

Share it:

POLITICS

Post A Comment: