CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనికి చేసిన అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:

 


కరోనా సర్వే పకడ్బందీగా చెయ్యాలి

  మన్యం టీవీ కరకగూడెం:కరకగూడెం గిరిజన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దురిశెట్టి.  అనుదీప్  ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లు పరిచిలించడం చేయడం జరిగింది. 

తనిఖీలో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో జరుపుతున్న కోవిడ్ టెస్ట్ ల గురించి అడిగితెలుసుకున్నారు.

వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఎప్పటికప్పుడు గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలని ప్రాధమిక ఆరోగ్య కెంద్రం  లో ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు. తేది,సమయాలను ప్రచారం చేయాలని వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని 45 సంవత్సరాలు నిండిన వారు అందరు వ్యాక్సిన్ కొరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

గ్రామాలలో జరిగే ఫివర్ సర్వే గురించి అడిగితెలుసుకొని కోవిడ్ లక్షణాలు వున్నట్లు గుర్తించిన వారికి మెడిసన్ కిట్ తో పాటు ,మందులు వాడే విధానాన్ని తెలిపే పాంప్లేట్లు అందజేయాలని ఆదేశించారు.

అన్ని హెల్త్ సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి ని త్వరగా ప్రారంబించాలని సిబ్బందికి తెలుయజేసారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరించి కోవిడ్ నిబందనల గురించి తెలుసా అని అడిగి కనుక్కునారు. చెప్పిన సమాధానానికి సంతృప్తి వ్యక్తం చేసారు. ఆసుపత్రికి వచ్చే వారు ఎటువంటి అనారోగ్య భయం లేకుండా  రాగలిగేలా స్నేహపూర్వక వాతావరణంతో వుండేట్టు చూడాలని రోగులకు మందుల తోపాటు మనోధైర్యం అవసరమని  సూచనలు చేసారు.

అనంతరం కన్నాయిగూడెం డంపింగ్ షెడ్ లో తయారైన వర్మీకంపోస్ట్ శాంపిల్ ని య.పి.ఓ.సునీల్ అదనపు కలెక్టర్  అందజేయగా మారుమూల గిరిజన పంచాయితీలు కూడా ఇటువంటి చెత్త నిర్వాహణ మార్గాల వైపు మార్పు చెందడం సుభసూచకమని కన్నాయిగూడెం సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మీ ,కార్యదర్శి యమ్.తరుణ్ లను ను పర్యవేక్షణాధికారిగా పని చేస్తున్న యం.పి.ఓ ను అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: