CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వాలా యూత్ ఆధ్వర్యంలో "జ్వాలా చారిటబుల్ ట్రస్ట్" ప్రారంభం

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 జ్వాలా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదేళ్లు గా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేయడం జరిగిందని "జ్వాలా" యూత్ అధ్యక్షుడు కోడెల నరేష్ శుక్రవారం తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక మునుముందు కూడా చేస్తూనే ఉంటామని దానిలో భాగంలోనే శుక్రవారం "జ్వాలా చారటబుల్ ట్రస్ట్" ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ట్రస్ట్ ధ్వారా మొదటిగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి పేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్వాలా కరోనా కిట్ పేరుతో నిత్యవసర వస్తువులు పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికంగా ఏమీలేనటువంటి పేద,బీదవారు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్  9490051120, 9963590154 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ధ్వారా పది మందికి సహాయం చేయాలి అనుకునేవారు 7569907335 కి         ఫోన్ పే ,గూగుల్ పే,  బ్యాంక్ అకౌంట్ నెంబర్: 086610100136038 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగపేట బ్రాంచ కి సహాయం చేసి పేద ప్రజల ఆకలి తీర్చడంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. ఇప్పటివరకు జ్వాలా యూత్ కి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా పాదాభివందనం తెలియజేస్తున్నామని  ఇకముందు కూడా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయబోయే ప్రతీ కార్యక్రమంలో మీ వంతు సహాయసహకారాలు అంధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.  జ్వాలా యూత్  

ట్రస్ట్ చైర్మన్ గా కోడెల నరేష్, వైస్ చైర్మన్ బండపల్లి రవి గౌడ్, ట్రస్ట్  డైరెక్టర్లు చాదా మల్లయ్య, ముప్పా మోహన్ రెడ్డి, సయ్యద్ బాబా, మునిగాల రాకేష్, పుల్లంశెట్టి అజయ్, కళ్లెబోయిన సురేష్, పల్లపు రమెష్, కస్పా ముకుందం, ఆత్మకూరి సతీష్ లను నియమించినట్లు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: