CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

లాక్ డౌన్ పటిష్టంగా అమలు

Share it:

 


 ప్రజలు కరోనా బారిన పడకుండా కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మా లక్ష్యం కాదు.

*సిఐ సట్ల కిరణ్ కుమార్.

మన్యం టీవీ ఏటూర్ నాగారం: 

లాక్ డౌన్ వేళ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారుల వాహనాలను సీజ్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం మా లక్ష్యం కాదని ప్రజలు కరోనా వ్యాధికి గురికాకుండా కుటుంబంతో సంతోషంగా వుండాలనదే పోలీసుల ఉద్యేశమని ఏటూర్ నాగారం సిఐ సట్ల కిరణ్ కుమార్ తెలిపారు. మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం ఏటూర్ నాగారం పరిధిలో ప్రతిష్టంగా లాక్ డౌన్ కోనసాగుతోంది. రాష్ట్ర పోలీస్ బాస్ ఇచ్చిన సూచనలతో గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు మరింత వేగం పెంచారు. ఇందులో భాగంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకుగాను రోడ్ల మీదకు వచ్చే వాహనదారులను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో పాటు, వాహనదారులు చూపించే వైద్య మరియు అనుమతి పత్రాలను పోలీసులు నిషితంగా పరిశీలించడంతో పాటు తప్పుడు పత్రాలతో రోడ్ల మీదుకు వచ్చిన వాహనదారులకు చెందిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తూ ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి పోలీసులు ఇప్పటి వరకు సూమారు 50 వాహనాలపై కేసులను నమోదు చేసి జరిమానాలు విధించడం జరిగింది. అదే విధంగా గత మూడు రోజుల నుండి వేగం పెంచిన పోలీసులు ఇప్పటి వరకు 30 వాహనాలను పోలీసులు సీజ్ చేసి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే విధంగా లాక్ డౌన్ నిబంధనలను సంబంధించి కేసులను పోలీసులు నమోదు చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏటూర్ నాగారం సర్కిల్ పరిధిలో క్షేత్ర స్థాయిలో చెక్ పోస్టుల వద్ద బస్టాండ్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ వద్ద, ప్రధాన కూడళ్లలో తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్ల మీదకు అనవసరంగా వచ్చిన వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ మరింత పటిష్టంగా ఆమలు చేయడం జరుగుతుందని, ఇందుకోసం ప్రధాన మార్గాలకు అనుసంధానమైన రోడ్డు మార్గాల్లోను ముమ్మరంగా పెట్రోలింగ్, తనీఖీలు నిర్వహించబడటంతో పాటు పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడబడుతుందని, ఇకనైనా వాహనదారులు అనవసరంగా రోడ్లమీదకు రావద్దని, ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే చిక్కుల్లో పడుతారని సీఐ సట్ల కిరణ్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీలో ఎస్సై శ్యామ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: