CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిటిపిఎస్ భూ నిర్వాసితుల కు మే 15వ తారీఖు లోపు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి: ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి డిమాండ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు,పినపాక మండలాల పరిధిలో ని బిటిపిఎస్ భూ నిర్వాసితుల కు మే నెల 15వ తారీఖు లోపు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని,జెన్కో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బిటిపిఎస్ సిఈ బాలరాజు ని కలిసి ఈ విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిటిపిఎస్ నిర్మాణానికి మీ భూములు ఇస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రెండు పంటలు పండే భూములను బిటిపిఎస్ నిర్మాణానికి ఇస్తే రెండు సంవత్సరాలకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి,ఏడు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.నిర్వాసితులు అటు భూమి లేక ఉద్యోగం రాక వారి కుటుంబ పోషణ భారమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు మండిన నిర్వాసితులు ఆందోళన నిర్వహించిన అప్పుడల్లా వాయిదాలు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప,వారికి ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు.కడుపు మండిన నిర్వాసితులు మే డే రోజు ఆందోళన నిర్వహిస్తే ఈ నెల 15వ తారీఖు వరకు ఉద్యోగాలు కల్పిస్తామని మరొక వాయిదా పెట్టారన్నారు.ఈ సారైనా ఇచ్చిన హామీని నెరవేర్చి జెన్కో యాజమాన్యం, ప్రభుత్వం మే 15వ తారీఖు వరకు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.లేని యెడల మా యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని యూనియన్ లను, పార్టీలను కలుపుకొని నిర్వాసితుల తో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలకు జెన్కో యాజమాన్యం, మరియు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భూ నిర్వాసితులు అంతా ఆందోళనకు సిద్ధం కావాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: