CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్లేడే,పీహెచ్డీ లపై సింగరేణి యాజమాన్యం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి:ఐఎఫ్టియూ

Share it:

 


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లో ఉపరితల గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు నెలకు మూడు ప్లేడే లకు మించి చేయకూడదని యాజమాన్యం ఆంక్షలను, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ చర్య కార్మికులకు ఆర్ధికంగా నష్టంకరమైనది మరియు ఉత్పత్తి,ఉత్పాదకత లపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది,ఇప్పటికే సింగరేణి కార్మికులు లాక్ డౌన్ సమయంలో ప్లేడే, పీహెచ్ డి లు నష్టపోయారు. దీనికి తోడు ప్రతినెల ఆదాయపు పన్ను విధింపు మరింత ఇబ్బంది పెడుతుందని,ఈ నేపథ్యంలో కార్మికుని ఎంతోకొంత ఆర్థికంగా ఆసరా ఉండేది ప్లేడే,పీహెచ్ డి లపై యాజమాన్యం విధించిన ఆంక్షలు తీసివేయాలని,అలాగే కొన్ని యంత్రాలకు ఆపరేటర్లు, డ్రైవర్లు నిర్వహణకు సంబంధించి టెక్నీషియన్లు పరిమిత స్థాయిలో ఉంటారు.ఆంక్షల కారణంగా వీరిని విధులకు రానియకపోతే దీని ప్రభావం ఉత్పత్తి,ఉత్పాదకత పై పడే అవకాశం ఉందని,ఒకవైపు ఉత్పత్తి లక్ష్యాలు పెంచుకుంటూ మరోవైపు కార్మికుల ఆర్థిక అవకాశాలు తుంచడం సరికాదు అని, సత్వరమే ప్లేడే,పీహెచ్ డి లపై విధించిన ఆంక్షల సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని సింగరేణి జిఎం కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాసర్ పాషా,పూనెం.ప్రదీప్,మంగీలాల్,ఎం.రాజు,ఎం.రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: