CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసుపత్రి నిర్మాణం ఆలస్యానికి అధికారపార్టీ నాయకులే కారణం అనేది అవాస్తవం-తెరాస సీనియర్ నాయకులు.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

కేంద్ర ప్రభుత్వం సమీకృత గిరిజనభివృద్ధి సంస్థ పరిధిలో ప్రత్యేకమైన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయగా అందులో భాగంగా రాజుపేట కు కూడా అటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటానికి గ్రామస్తులు ఇదివరకు ఆసుపత్రి కోసం స్థలం ధాతలు గ్రామ శ్రేయస్సు కోరి స్థలం ఇవ్వటం జరిగింది. ఆ స్థలం లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది.ఆ ఆసుపత్రి నాణ్యత తో నిర్మించటానికి తెరాస నాయకులు  కర్రి శ్యాంబాబు   ముందుకువచ్చారు. ఈ విషయం పై కర్రి శ్యాంబాబు ను వివరణ అడగ్గా స్థలం ఇచ్చిన వారి తరపున కొంతమంది ఇక్కడ ఆసుపత్రి కట్టడానికి వీలు లేదు అని శంకుస్థాపన చేసినతర్వాత కూడా తీసిన గోతులు పూడ్చారు.  ఈ విషయంలో అధికారపార్టీ నాయకులు ఆసుపత్రి నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు అనడంలో వాస్తవం లేదు.  అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోనే రాజుపేటకు ఆసుపత్రి కావాలని కోరాము, అందులో భాగంగానే మంజూరు అయిన దరిమిలా ఆసుపత్రి పనులు ప్రారంభించాము, ఇప్పుడు స్థలం ధాత తరపున వచ్చిన వ్యక్తి   వచ్చి అడ్డుతిరిగి ఇస్తే ఆ కాంట్రాక్టు నాకే ఇవ్వాలి లేదంటే స్థలం ఇవ్వను అని మాట్లాడితే ఇది అన్యాయం కాదా? అట్లా అయితే రాజుపేట లో పశువుల ఆసుపత్రి, స్కూల్స్, రోడ్లు, స్థలం లేని వ్యక్తులకు ఇండ్ల కోసం ఎకరాలు ఎకరాలు దానం చేసిన దాతలు వీరందరు ఈ తీరుగా ఆలోచిస్తే?వారుకూడా మా స్థలాలు మాకు కావాలి అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో  విజ్నులైన దాతలు మీరే ఆలోచించండి. గ్రామ అభివృద్ధి కోసం మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కట్టుబడి ఉంటాము. గ్రామ అభివృద్ధి అనేది రాకీయాలకు, కుల మతాలకు అతీతమైన అంశం కావునా ఈ విషయం లో రాజకీయం చేయొద్దని నామనవి, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను ఆడ్డుకోవద్దు అటువంటి ఆలోచన కూడా రాకూడదు గ్రామ అభివృద్ధి కోసం పార్టీ జెండాలు సైతం పక్కనపెట్టి గ్రామ అభివృద్ది ఎజెండా భుజానికెత్తుకొని అందరూ కలసికట్టుగా పాటుపడవలసిన అవసరం ఉందంటూ తెరాస సీనియర్ నాయకులు ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: