CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన విప్ రేగా కాంతారావు

Share it:

 



91 మంది లబ్ధిదారులకు రూ.95 లక్షల విలువ గల చెక్కుల పంపిణీ


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పధకం ద్వారా మణుగూరు మండల లో 91 మంది లబ్ది దారులకు రూ.95 లక్షల రూపాయల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని,ప్రజల వద్దకు పాలన టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడ బిడ్డలకు పెళ్లి కానుక గా రూ.1,00,166 ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, తహశీల్దార్ చంద్ర శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీ కణితి బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ లు బచ్చల భారతి, కారం.ముత్తయ్య టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: