CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసుల భూముల జోలికొస్తే ఖబడ్దార్:ఆదివాసి సంక్షేమ పరిషత్, తుడుందెబ్బ

Share it:

 


మన్యంటివి:నూగురు వెంకటాపురం

ఏజెన్సీ లో అభివృద్ధి పేరు తో ఆదివాసుల భూములు దోపిడీచేయలని చూస్తే సహించేది లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగ గణేష్ అన్నారు.ఏయస్పి జిల్లా కార్యదర్శి పూనెం చంటి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో రేగ గణేష్ పాల్గొని అయన మాట్లాడుతూ మరికాల గ్రామపంచాయతీ రెవెన్యూ విలేజ్ మరికాల (జడ్)నందు సర్వే నంబర్ 9 లో గల 5 ఏకరాల భూమి లో చెరుకుల వెంకటేశ్వర్లు గత పదిహేను సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూమిని అభివృద్ధి పేరుతో అక్రమంగా స్వశన వాటికను నిర్మించుకున్నదే కాక మొత్తం భూమిని సైతం రాజకీయ పార్టీల అండదండలతో దోపిడీ చేస్తున్నారని అయన ఆరోపించారు.అదే రెవెన్యూ విలేజ్ లో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు క్రయవిక్రయాలు చేసిన భూములకు ఏవిధంగా పట్టాలు చేశారని ఆయన ప్రశ్నించారు.వెంకటాపురం లో పనిచేస్తున్న అధికారుల పనితీరును పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: