CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం

Share it:

 



పినపాక టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయడంతో హర్షం వ్యక్తం చేస్తు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గం  మణుగూరు టీఆర్ఎస్ పార్టీ  కార్యాలయం నందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ,

ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ యువత చిరకాల కోరిక స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అన్నారు.1969 ఉద్యమం ఉద్యోగాలకోసం అని,అదేవిధంగా 2001 నుండి మన ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది అని, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని ఉద్దేశంతో ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా విభజించారు అని తెలిపారు.దీని ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే  కల్పించడం జరుగుతుంది అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు,రాష్ట్ర అభివృద్ధికి,రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పన జరిగేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ విద్యార్థులు, యువత పక్షాన ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు మైస వినోద్ కుమార్, మండల నాయకులు తాళ్ళపల్లి రాహుల్,చల్లా ఉదయ్ కుమార్,గుండగాని అజయ్ గౌడ్,సాయి చరణ్, ముద్దంగుల వంశీ,బోయళ్ళ రమణయ్య,బోయిళ్ళ రాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: