CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాగర్ అప్ డేట్స్

Share it:

 



        సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్


హాలియా: నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుటుంబ స‌మేతంగా ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో ఓటు వేశారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌రోనా బాధితుల‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.


సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌.. ఇబ్ర‌హీంపేటలో ఓటు వేసిన నోముల భ‌గ‌త్‌

ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భ‌గ‌త్ పోటీలో ఉండ‌గా, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి త‌ల‌ప‌డుతున్నారు. వ‌చ్చే నెల 2న ఉప ఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి

Share it:

TELANGANA

Post A Comment: