CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

అకాల వర్షం- రైతుల కష్టాలు

Share it:

 


మన్యం మనగడ పినపాక:

 వేసవి కాలం సమీపించి ఎండలు తీవ్రస్థాయిలో మండుతున్న వేల, శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు ఏర్పడి కొద్ది పరిమాణంలో వర్షం రావడం జరిగింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా నే ఇటీవల యంత్రాల సహాయంతో కోసిన వడ్లను రైతులు తరలించి ఆర పెడుతున్నారు. ఈ సమయంలో వర్షం రావడంతో రైతులు కళ్ళ వైపు పెద్దపెద్ద మరకలను తీసుకుని పరుగులు తీసి వడ్లను వర్షం భారీ పడకుండా  కప్పి వేయడం జరిగింది.

పినపాక మండలం లోని పాండురంగాపురం పంచాయతీలోని   ఇప్పల గుంపుకు చెందిన గొగ్గలి అబ్బయ్యకు చెందిన  కల్లంలో ఆరబోసిన మూడు ఎకరాల ఒడ్లు తడిసిపోయాయి.ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట చేతికి వస్తుందని అనుకున్న సమయంలో ఈ విధంగా వర్షం పాలు కావడం పంచాయతీలోని అందరినీ కలచివేసింది. ఇదికాక పినపాక మండలం లోని చిన్న సన్నకారు రైతులు అకాల వర్షం ప్రభావంతో నష్టపోయారని సమాచారం.

Share it:

TELANGANA

Post A Comment: