CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై అవగాహన కల్పించిన డిఎస్ఓ-డాక్టర్ చేతన్

Share it:

 



మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని ఆర్ఎంపి/పిఏంపి/ప్రైవేట్ ప్రాక్టీషనర్లకు , తహసిల్దార్ కార్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఎం భద్రకాళి ఆధ్వర్యంలో  జిల్లా సర్వే లైన్ అధికారి (డిఎస్ఓ) - డాక్టర్ చేతన్ సమావేశం ఏర్పాటు చేసి, రూపాంతరం చెంది శక్తిని రెండింతలు చేసుకొని, ప్రజలను మృత్యుఒడిలోకి చేర్చుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల గురించి , వ్యాప్తి చెందుతున్న తీరు మరియు ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పాటించవలసిన సామాజిక దూరం, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శానిటైజర్ చేసుకోవడం , తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప  ఎటువంటి  పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో సంచరించ వద్దనే ముఖ్య అంశాల గురించి మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా ఆర్.ఎం.పి/పి.ఎం.పి/ప్రైవేట్ ప్రాక్టీషనర్లును , గ్రామాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించే విధంగా కృషి చేయాలని, అందరూ టీకాలు వేయించుకునేలా చైతన్య పరచాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వరదా రెడ్డి , ఎంపీడీవో జి రేవతి , సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు , పిహెచ్సి ఆరోగ్య విస్తరణ అధికారి (హెచ్ఇఓ)- పోలెబోయిన కృష్ణయ్య , ఆర్ఎంపి/పిఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ పుల్లారావు , తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: