మన్యం టీవీ మంగపేట.
మండలంలోని పాలయిగూడెం గొత్తికోయ గూడెంలో స్థానిక మంగపేట ఎస్సై సి.హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘవిద్రోహ శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని అన్నారు. గూడెంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంగపేట సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Post A Comment: