CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పోడుసాగు దారులకు అండగా ఉంటాం..

Share it:


👉ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు 

మన్యం టీవీ కొత్తగూడెం

ఈ రోజు భద్రాద్రి జిల్లా లో కొతగూడెం లో గల శ్రీ కృష్ణ ఇన్ హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సోయం బాపురావ్  మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు సమస్యలు అధికంగా ఉన్నాయని దీనికి ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం గా వ్యవహరిస్తూ ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని,ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను హరితహారం పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని అన్నారు పొడుపట్టా వచ్చే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 


ఫారెస్ట్ అధికారులు జిల్లాలో కేవలం ఆదివాసీల భూములనే ,టార్గెట్ చేస్తూ వారి వద్ద నుండి భూముకు లాకొంటున్నారని, లంబాడా ,గిరిజనేతరుల వద్ద ఉన్న భూములను మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ, ఆదివాసీల ను అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.  జిల్లాలో పోడు సమస్యలు ఆదివాసీల దాడులపై , అక్రమ అరెస్టు లపై  ఐటీడీఏ po , జిల్లా కలెక్టర్లకు మాట్లాడకుండా ఉండటంతో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.


అశ్వాపురం మండలం తుమ్మల చెరువు ,దుమ్మగుడెం మండలం చింత గుప్పు పోడు దారులకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.పోడు దారులకు పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో  తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తాం అన్నారు. జిల్లా LTR కేసులు త్వరిగతిన పరిష్కరించాలని,గిరిజ నేతరుల ఖభాంద హస్తాల్లో ఉన్న భూముకు విడిపించాలని డిమాండ్ చేశారు. 


ఆదివాసీ ల మే 3 నుండి పోడు భరోసా యాత్ర ఉంటుందని తర్వాత జూన్ 6 న కొత్తగూడెం లో బారి బహిరంగ సభ నిర్వహిస్తున్న ట్లు స్పష్టంచేశారు. సమస్య ల పరిష్కారానికి ఆదివాసీ లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.


2006 అటవిహక్కుల చట్టం ప్రకారం ,పేసా చట్టం ప్రకారం గ్రామసభలు తీర్మానాలు ద్వారా ఆదివాసీల కు న్యాయం చేయాలన్నారు. తుడుందెబ్బ  ఆదివాసీ సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందనిఅన్నారు


.ఈ కార్యక్రమంలో  తుడుందెబ్బ జిల్లా అద్యక్షులు సనప కోటేశ్వరరావు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగ్గేల రామస్వామి , తుడుందెబ్బ నాయకులు సోయం కన్నారాజు, జోగ శ్రీను, పుసం సుదీర్, వాసం శ్రీకాంత్, ఈసాల వెంకట్ ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: