CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరకగూడెం మండలాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.

Share it:

 


3 కోట్ల25 లక్షల రూపాయలతో రూపురేఖలు మారనున్న గ్రామీణ ప్రాంతాలు

అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు కేటీఅర్,పూవ్వాడ,ఎంపీ కవిత కు ప్రత్యేక ధన్యవాదాలు తేలిపిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం టీవీ కరకగూడెం:పినపాక నియోజకవర్గంలోని పూర్తిగా ఏజెన్సీ మండలం అయిన కరకగూడెం మండలంలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధికి 3 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగినదని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ కరకగూడెం మండాలన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాన్నారు.మండల ప్రాంతానికి రూపురేఖలు మారుతాయని ,అభివృద్ధి కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకేళ్ళానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెనువెంటనే స్పందించి పినపాక నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కొరతలేదని తేలిపారని అన్నారు.అలాగే కరకగూడెం మండలపరిదిలోని సమత్ భట్టుపల్లి పరిధిలో గిరిజన కమ్యూనిటీ హాల్ కోసం 50 లక్షలు నిధులు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.మండలంలోని వివిధ గ్రామలలోని ఉన్న మట్టి రోడ్లను సిసి రోడ్లుగా మారుతయన్నారు.అలాగే మోతే గ్రామంలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం 4 కొట్ల 50 లక్షలు రూపాయలు పుల్లతోగు వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి 2 కొట్ల 50 లక్షల రూపాయలు    చిరుమళ్ల నుండి దోమేడా     వరకు రోడ్డు నిర్మాణ పనులకు 2 కొట్ల రూపాయలు భట్టుపల్లి నుండి బుద్దారం వరకు నిర్మాణం కొరకు 2. కోట్ల 50 రూపాయల నిధులు మంజూరు చెయ్యడం జరిగిదని తెలిపారు.అలాగే మండలపరిదిలోని గొడుగు బండా గ్రామంవద్ద వట్టివాగుపై నిర్మాణం చెపట్టనున్నా వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణం కొరకు 13 కోట్ల 52 లక్షల రూపాయలు మంజూరు చెయ్యడం జరిగిందని ,అలాగే పినపాక కరకగూడెం మండలాల రైతుల చిరకాల స్వప్నం పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం కోసం 180 కోట్ల రూపాయలు నిధులు మంజూరుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.కరకగూడెం మండలం మరింతగా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.త్వరలోనే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయని ప్రభుత్వ విప్ రేగా అన్నారు.ఏజెన్సీ మండలం అయిన కరకగూడెం మండల అభివృద్ధి కి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రులు కెటిఅర్ పువ్వాడ అజయ్ కుమార్ మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా బూర్గంపాడు వ్యవసాయ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజీత్ కుమార్ మండల నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి పోగు వెంకటెశర్లు యలిపెద్ది శ్రీనువాస్  రెడ్డి కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి గౌడ్ కొమరం సురేష్ తోలెం సారయ్య జవ్వాజి సమ్మయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: