CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయితీ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేపించండి

Share it:

 


తమ గోడును అధికారులు వినాలని ఆవేదన

మన్యం మనుగడకు తెలియజేసిన సర్పంచుల సంఘం


మన్యం మనుగడ, పినపాక:

 పంచాయితీలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లను , వాటర్ ట్యాంకర్ లను అందజేసింది. ట్రాక్టర్ కైతే రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ, ట్రాలీ వాటర్ ట్యాంకర్ లకు రిజిస్ట్రేషన్ లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. పినపాక మండలం లోని మల్లారం పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ఇటీవల ప్రమాదానికి గురై ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లోనే ఉందని, రిజిస్ట్రేషన్ లేని కారణంగా వాహనాన్ని పోలీసులు నిలిపివేశారని , పినపాక పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వర రావు అన్నారు.

అంతేకాకుండాపంచాయతీ అభివృద్ధి పనుల్లో భాగంగా చేసిన పనులకు సంబంధించిన బిల్లు ఇప్పటికీ కూడా ఎస్ టి ఓ  ఆఫీస్ లో పెండింగ్ లోనే ఉన్నాయని, ఎప్పుడు అడిగినా త్వరలోనే పని అవుతుందని అధికారులు చెబుతున్నారని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.వారి సమస్యలను ఈ విధంగా తెలియజేస్తూ,పినపాక లో సమావేశం ఏర్పాటు చేశారు

ట్యాంకర్ల కు,ట్రాలీలకు రిజిస్టేషన్ చేయించాలి

2018జీవో  ప్రకారం సర్పంచుల కు రూ.25వేలు చెల్లించాలి.తాము ఎప్పటినుండో సంపాదించుకున్న సొమ్మును పంచాయతీ అభివృద్ధి కోసం ఉపయోగించి, కొత్త అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి వినియోగించి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నామని, తమ ఆవేదనను తెలియజేశారు.ఈ విషయమై స్థానిక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు కి వినతి పత్రము గతంలోనే అందజేశామని , ఈ విషయమై త్వరగా స్పందించి పై అధికారులకు తెలియజేయాలని విన్నవించామని, సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిళ్లపల్లి నరసింహారావు, సర్పంచులు గొగ్గల నాగేశ్వరరావు, బాడిస మహేష్, కృష్ణంరాజు,   సుధాకర్, సునీల్ కుమార్, శివ శంకర్, వర్సా స్వాతి నాలి మహేష్  , తోలెం కళ్యాణి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: