CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేటి నుండి విదించనున్న కర్ప్యూకి మండల ప్రజలు సహకరించగలరు.

Share it:

 


కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్

మాన్యం టీవీ కరకగూడెం:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తిసుకున్న సందర్భంగా కరోనాను నియంత్రించేందుకు గాను నేటి రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ప్యూ విధిస్తున్నట్లు కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాత్రి నుండి  30 వ తారీఖు వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని తెలిపారు.మండల ప్రజాలు ,వ్యాపారస్తులు కర్ఫ్యూ కు సహకరించగలరని కోరినారు.ఎవ్వరూ అయినా నిబంధనలను ఉల్లంఘించి యోడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 8 గంటలల్లోపు వ్యాపార సముదాయాలను మూసి వేయాలని తెలిపారు. అత్యవసరమైన సేవలు మరియు నిత్యావసర సరుకుల రవాణా,మందులు(మెడిసిన్) రవాణా, నీటి సరఫరా పనులు మినహాయింపు కావున మండల ప్రజలు కర్ఫ్యూ కి సహకరించి కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరని కరకగూడెం పోలిస్ శాఖ విజ్ఞాప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: