CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుకు అండ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Share it:

 



ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర వర్మ

మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని. సంఘ చైర్మన్ రవివర్మ  ఆధ్వర్యంలో ఎంపీపీ గుమ్మడి గాంధి  చేతుల మీదుగా సోమవారం రోజున  ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు... దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బీమా, రైతుబంధు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు,24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు పండించిన ధాన్యమును ప్రభుత్వమే రూ.1888 ల మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొన్న డబ్బులను వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు...

 ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య,  రైతు సమన్వయ కమిటీ అధ్యక్శుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,సొసైటీ వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట రెడ్డి, సర్పంచ్ కోరం రజిని, వార్డు మెంబరు ముల్లంగి వెంకటరెడ్డి ఏ ఓ, సొసైటీ సిబ్బంది, స్థానిక రైతులు , టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలునాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: