CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్...

Share it:

 





మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల తహసిల్దార్ కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, పాల్గొని 29 మంది, లబ్ధిదారులకు 32 లక్షల రూపాయల, విలువైన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ,చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్ లను అందజేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ,వారి సతీమణి రాంబాయి, స్థానిక వైద్యాధికారి వీరబాబు, ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జెడ్ పి టి సి కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి ,ఎంపీటీసీలు రాజశేఖర్, మధుసూదన్ రావు , తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపిఓ రామారావు, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: