CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా సెక్టోరియల్ అధికారిగా సైదులు

Share it:

 మన్యం మనుగడ, పినపాక:

ఉద్యోగ ఉన్నతి పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం లోజిల్లా సెక్టోరియల్ అధికారి గా ఏడూళ్ల బయ్యారం  ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యస్. కె. సైదులు,.( ఫిసికల్ సైన్స్ ) నియమించబడ్డారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి వీడ్కోలు ఏర్పాటు చేసినారు.

ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి లో సైదులు ని అభినందిస్తూ, వారి సేవలను కొనియాడుతూ, జిల్లాలో కూడా వారి సేవలను అందించి,పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, కోరారు. ఈ సందర్భంగాసైదులు మాట్లాడుతూ తల్లిదండ్రులు,గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారం ఎప్పటికి మరువలేనిది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మువ్వా వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రమాదేవి, శ్రీనివాస రావు, నాగేశ్వరరావు, సునీత, పాపారావు, నాగమణి, ప్రసాద్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: