CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామానుజవరం గ్రామ పంచాయతీ లో నిర్వాసితుల కోసం గ్రామ సభ ఏర్పాటు

Share it:

 


నిర్వాసితులకు న్యాయం చేస్తాం: అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ లో సీత రామ ప్రాజెక్టు లో భూములు కోల్పోతున్న 80 మంది భూ నిర్వాసితుల కొరకు అడిషినల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ అద్యక్షతన  గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లోని రైతులు వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నారు.అలాంటి మా పంచాయతీ ప్రజలు ఒక ప్రక్కన సింగరేణి లో భూములు కోల్పోయినారు. మరో ప్రక్కన బిటిపీఎస్ లో భూములు కోల్పోయినారు. ఇంటెక్ వెల్ లో భూములు కోల్పోయినారు,రైల్వే లైన్లో భూములు కోల్పోయినారు, మరల ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు లో భూములు కోల్పోతున్నారు.కానీ ఇంత వరకు బిటిపీఎస్ లో ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇంటెక్ వెల్ లో ఉద్యోగాలు ఇవ్వలేదు,రైల్వే లైన్ లో ఎలాంటి ప్యాకేజి అన్నది, ఉద్యోగాలు అన్నది స్వష్టత లేదు,అలాగే ఇప్పుడు నిర్వహిస్తున్న గ్రామ సభలో రైతులకు న్యాయం జరిగేలా మంచి ఆర్&ఆర్ ప్యాకేజి మరియు అర్హులు ఐన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కలిపించాలని రైతులు దరఖాస్తు రూపంలో కలెక్టర్ కు విన్నవించుకోవడం జరిగింది.అలాగే ముంపునకు గురి అయ్యే  గోదావరిలో వున్న రైతులు కూడా నష్టపరిహారం కూడా అదే విధంగా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.ఎవరైతే రైతుల పేర్లు మరియు పొలాల సంబందించిన తప్పిదములు ఉంటే త్వరగా సరి చెయ్యగలరు అని కోరడమైనది.ఈ యొక్క కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మణుగూరు తహసిల్దార్ చంద్ర శేఖర్,మరియు రెవిన్యూ సిబ్బంది, రామానుజవరం సర్పంచ్ బాడిశ.సతీష్,మాజీ ఎంపిపి ఎడారి.రమేష్,అక్కి.నరాశిహరావు,అసుల.వెంకటేశ్వర్లు,పంచాయతీ కార్యదర్శి సునీత,గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: