CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ని కలిసిన పైడి గూడెం పోడు రైతులు

Share it:

 



ఫారెస్ట్ అధికారుల తీరు, పెడుతున్న ఇబ్బందుల పై విప్ రేగా కాంతారావు కు వినతిపత్రం అందజేసిన ఆదివాసీ,గిరిజన రైతులు


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, పైడి గూడెం గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాలుగా ఆదివాసి రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు మరియు పోలీసు యంత్రాంగం కలిసి భూములను సాగు చేయకుండా ఆపుతూ, అడిగిన వారిపై అక్రమ కేసులు పెడుతూ ఆదివాసులు ఇబ్బంది పెడుతున్నారని,సుమారు 100 మంది ఆదివాసీ, గిరిజన రైతులు వారి యొక్క బాధలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను వారి సమస్యలు వివరించి, తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఫారెస్ట్ అధికారుల వేధింపుల తో సరిగా అన్నం కూడా తినలేని పరిస్థితి ఉన్నదని,అధికారుల చుట్టూ తిరుగుతున్నాము అని వారి బాధను వెళ్లబుచ్చారు.ఒక మహిళ రైతు సొమ్మసిల్లి కింద పడిపోవడంతో,వారిని చూసి చలించిపోయిన విప్ రేగా కాంతారావు వెంటనే ఆమెకు మంచి నీరు అందించారు.అనంతరం మాట్లాడుతూ త్వరలో మీ ఊరికి వస్తాను అని, సమస్యల ని అక్కడే పరిష్కరిస్తాము అని వారికి హామీ ఇచ్చారు.దూరం నుంచి వచ్చిన వారికి ఎండ తీవ్రత బాగా ఉండడం తో భోజనం మరియు దారి ఖర్చులకు రూ.10 వేల రూపాయలను విప్ రేగా కాంతారావు రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ,రైతులు వెంకటలక్ష్మి,నాగమణి, రమణ,వెంకటమ్మ,అంజయ్య,వీరమ్మ,లక్ష్మీ,దేవి, గంగమ్మ,సమ్మక్క,లక్ష్మి, జ్యోతి,మీడియం రామక్క, రమణ,కణితి.జోగయ్య, వెంకట్ లక్ష్మి,రాజు, నరసింహారావు,అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: