CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి -ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు

Share it:

 



 మన్యం టీవీ, అశ్వరావుపేట:కోవిడ్ - 19 నివారణ కోసం కేంద్రప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్ వ్యాక్సిన్ 45 పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతున్న ప్రతీ ఒక్కరూ వేయించుకోవాలని తిరుములకుంట ఉప సర్పంచ్ జుజ్జూరి రాంబాబు గ్రామస్తులకు పిలుపునిచ్చారు.గురువారం మండల పరిధిలోని తిరుములకుంటలో వినాయకపురం ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రి వైద్యారోగ్యశాఖ సిబ్బందిచే ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ అవగాహన లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్.ఎం పొట్టా వరలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ముక్కూ మూతికి మాస్క్ ధరించడటటంతో బాటు, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, మనిషికి మనిషికీ కనీసం దూరం పాటించే నియమాలు అమలు చేసుకోవాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం(సుగర్), రక్తపోటు

(బి.పి) లాంటి వ్యాధులతో చికిత్స పొందుతున్న 45 నుండి సంవత్సరాలు పై బడిన ప్రతీ ఒక్కరూ టీకా చేయించుకోవాలని కోరారు. ఈ టీకాను అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం, వినాయకపురం పి.హెచ్.సి లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు ఇస్తారని, టీకా చేయించుకునేవారు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్నం రామలక్ష్మయ్య, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, తిరుమలకుంట సెక్రెట్రీ రమేష్ నాయక్, విఆర్ఏ రాము, ఆశా వర్కర్ నాగమణి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: