CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించాలి ఇల్లందు - డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు క‌రోనా విల‌య తాండ‌వం చేయ‌డంతో గ‌తంలో విధించిన లాక్‌డౌన్ ఎంతో మంది పేద ప్ర‌జ‌ల‌కు న‌ష్టం చేకూర్చింద‌ని, గ‌త అనుభ‌వాల నేప‌ధ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించి క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి అంద‌రూ కృషిచేయాల‌ని డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు.  క‌రోనా సెకెండ్ వేవ్ లో వైర‌స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌ద్యంలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా మాస్క్ ను త‌ప్ప‌నిస‌రిగా వాడాల‌ని భౌతిక దూరం పాటించాల‌ని డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. విధిగా ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ద‌రించాల‌ని, వ్యాపార స‌ముదాయాల వ‌ద్ద భౌతిక దూరం పాటించాల‌ని, వ్యాపార‌స్తులు  ‌మాస్క్ ద‌రించ‌ని వారికి ఎటువంటి వ‌స్తువులు అమ్మ‌కూడ‌ద‌ని , ఆటో డ్రైవ‌ర్లు మాస్క్ లేని ప్ర‌యానికుల‌ను ఎక్కించుకోకూడ‌ద‌ని సూచించారు. పెట్రోల్ బంకు వచ్చేవారు కంపల్సరీ మాస్కు ధరించాలి మాస్క్ లేని వారికి పెట్రోల్ కూడా పోయకూడదు అని ఆదేశించారు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ క్ర‌మంగా పెరుతున్న నేప‌ద్యంలో ప్ర‌తి ఒక్క‌రూ వాక్సిన్ వేయించుకోవాల‌ని పిలుపునిచ్చారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు మాస్క్ లేకుండా సంచ‌రిస్తే జ‌రిమానా విదించ‌డంతో పాటుగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: