CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి

Share it:

 


ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎమ్మెల్యే పిలుపు

పినపాక మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు.


మన్యం టీవీ, పినపాక:

పినపాక మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పినపాక మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వారి వారి ప్రగతి నివేదికలను సమర్పించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, కొందరు అధికారుల పని తీరు ని ప్రశ్నించారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. పినపాక మండలం లోని 23 పంచాయతీలలో ఏ ఒక్క గ్రామాన్ని అయినా, ఆదర్శ గ్రామంగా అన్ని రకాల మౌలిక వసతులు గల ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సవాలు విసిరారు.వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున సర్పంచులు పల్లె ప్రకృతి వనాల పట్ల జాగ్రత్త వహించి, మొక్కలు పెరిగే దిశగా అడుగులు వేయాలని సూచించారు.మిషన్ భగీరథ రాష్ట్రానికి ఆదర్శం అని, అన్ని రకాల పోషక విలువలతో కూడిన నీటిని తెలంగాణ ప్రభుత్వం అందించడం తెలంగాణ ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ నుండి వచ్చే నీరు, శుద్ధి చేయబడిన నీరు మాత్రమే అని, పోషక విలువలు ఉండవు అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇందిరా క్రాంతి పథకం ద్వారా వచ్చే పథకాలు, ప్రజలందరికీ అయోమయంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఐకేపీ గురించి ఎవరికీ అవగాహన లేదని అన్నారు. భూ తగాదాలు లేకుండా త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుపుతామని, రెవెన్యూ , ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.గ్రామాల సర్పంచులు ప్రతినెలా ప్రభుత్వం నుండి వచ్చే డబ్బును, గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని అధికార దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోషకాహారలోపంతో బాధపడే పిల్లలకు పోషకాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలకు సూచించారు. రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు పోషక ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు .అర్హులైన వారందరికీ కొత్త ఇల్లు ,పింఛను, రేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో  మండలం లోని ఎంపీటీసీలు,  వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: