CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్

Share it:

 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న.. మరోవైపు టోర్నీ నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన నిబంధనలతో సమాయత్తమయ్యారు. చెన్నైలో జరిగే ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రారంభ మ్యాచ్‌తో ఈ భారీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు కనులవిందు చేయనుంది. అయితే, ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 13 సీజన్లలో రన్‌మెషిన్ విరాట్ కోహ్లీనే కింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, ఒకే సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్, అలాగే అత్యధిక సెంచరీలు(ఇండియన్ ఆటగాడు) వంటి పలు రికార్డులు కోహ్లీ పేరిటనే ఉన్నాయి. ఇప్పటి వరకు కోహ్లీ 184 ఇన్నింగ్స్‌లలో 5,878 రన్స్ చేశాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో సురేష్ రైనా(5,368) ఉన్నాడు. ఇక 2016లో కోహ్లీ 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒకే సీజన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు ఇవే. అలాగే కోహ్లీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 5 శతకాలు బాదాడు. ఐపీఎల్‌లో ఓ ఇండియన్ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలివే. ఓవర్ ఆల్‌గా చూస్తే క్రిస్ గేల్ 6 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఐదువేల పరుగుల క్లబ్‌లో భారత్ నుంచి కోహ్లీ, రైనాతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా ఉన్నారు.

Share it:

Post A Comment: