CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో డా.బీ ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు

Share it:

 


మన్యం టీవీ,బూర్గంపాడు.


భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బీ ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలను సారపాక పట్టణంలో శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్-టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. అనంతరం కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద దళిత కుటుంబంలో పుట్టి,దళితుల అభ్యున్నతికి హక్కుల సాధన కోసం అవిరామ కృషి చేసి సంఘ సంస్కర్తగా తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించారని,సామాజిక సమానత్వం కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసాడని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మికులు బాల్ రెడ్డి, మల్లేష్,సతీష్ యాదవ్, ఎస్.రవి,ఆదినారాయణ, సీతారామిరెడ్డి, కొండారెడ్డి, మురళి,రాము తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: