CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండలంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులను నియమించాలి

Share it:

 



నియోజకవర్గ పేద ప్రజలందరికీ 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాని కి మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీల విజ్ఞప్తి                             


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి సుమారు 6 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మాణం జరిగింది.6 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం తో నియోజకవర్గ పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందడం లేదని,అఖిలపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు.కరోనాతో ఈ ప్రాంత  పేద ప్రజలు వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ 100 పడకల ఆసుపత్రి ఎవరి స్వలాభం కోసం నిర్మించారో అధికారులు,ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు.ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిస్థితి ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులను నియమించి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటల వైద్యం అందించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ,బీజేపీ,కాంగ్రెస్,సీపీఐ ఎం ఎల్ న్యూ డేమోక్రసి నాయకులు వట్టం నారాయణ,వాసిరెడ్డి చలపతి రావు,దొడ్డి కృష్ణ, కూచిపూడి.బాబు,రావులపల్లి.రామమూర్తి,పుణ్ణం భిక్షపతి,పిరినాకి నవీన్, గోళ్ళ సాంబశివరావు, ఆర్.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: