CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మే 1 నుంచి వ్యాక్సినేషన్..

Share it:

 


ఈ సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్


దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు.


 కాగా, మే 1 వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కాగా, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధ‌వారం సాయంత్రం నుంచి ప్రారంభించబోతున్నారు. ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా, ఈ వ్యాక్సిన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటించాయి.


ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి


కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ రిజిస్ట‌ర్ చేయాలి.


ఆ త‌ర్వాత మీ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి.అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.దాంట్లో మీ ఐడీ కార్డు(ఆధార్ లేదా పాన్ లేదా ఓట‌రు కార్డు) వివ‌రాలు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని సెల‌క్ట్ చేసుకోవాలి. వీలును బ‌ట్టి పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

Share it:

TELANGANA

Post A Comment: